నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ పరీక్ష ఫలితాలను ఈ నెల 25న(గురువారం) విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసిన అధికారులు.. సమయంలో స్వల్ప మార్పులు చేశారు. తొలుత నిర్ణయించిన సమయం కన్నా ముందే ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ముందుగా ప్రకటించినట్టు గురువారం ఉదయం 11గంటలకు బదులుగా.. రేపు ఉదయం 9.30గంటలకే ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేస్తారని తాజాగా ప్రకటించారు. అనివార్య పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎంసెట్ కన్వీనర్ డా.బి.డీన్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 నుంచి 14 వరకు జరిగిన పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఇంజినీరింగ్‌కు 1,95,275 మంది, అగ్రికల్చర్‌కు 1,06,514 మంది విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.