Wednesday, April 29, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపశ్చిమ బెంగాల్‌లో పోలీసుల జులుం

పశ్చిమ బెంగాల్‌లో పోలీసుల జులుం

- Advertisement -

కాళిగంజ్‌లో సీపీఐ(ఎం) అభ్యర్థి రోడ్డు షో అడ్డుకునే యత్నం
నిరసించిన పార్టీ నేతలు..ఎక్కడికక్కడే రోడ్డు షోలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)కు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. పోలీసులు కాళీగంజ్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల తీరును పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడే రోడ్డు షోలు నిర్వహించారు.
పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తుది ప్రచారంలో భాగంగా సబీనా యాస్మిన్‌కు మద్దతుగా కాళీగంజ్‌లో భారీ రోడ్‌ షో జరిగింది. రోడ్డుకు ఇరువైపులా ప్రజలు స్వాగతం పలికారు. ఉపఎన్నిక ఫలితాల లెక్కింపు రోజున తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ కార్యకర్తలు విసిరిన బాంబు దాడిలో నాలుగో తరగతి విద్యార్థిని తమన్నా మరణించిన విషయం విదితమే. తన ఏకైక కుమార్తెను కోల్పోయిన సబీనా యాస్మిన్‌ కలిగంజ్‌ను బాంబు రహితంగా, అసాంఘిక కార్యకలాపాలు లేని ప్రాంతంగా మార్చి, అభివృద్ధితో పాటు శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు.

పోలీసులు చర్య సరికాదు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీం
పలాశీ శివార్ల నుంచి ప్రారంభమైన ఈ భారీ రోడ్డు షోలో విద్యార్థులు, యువతులు, రైతులు, వలస కార్మికులు పాల్గొనడం, చివరి వరకు పోరాడాలనే వారి దృఢ సంకల్పం అధికార శిబిరంలో కలవరాన్ని సృష్టించింది. దీంతో రోడ్డు షోకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలకు దిగింది. ఈ మేరకు సీపీఐ(ఎం) అభ్యర్థి సబీనా యాస్మిన్‌ రోడ్డు షోను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసుల చర్యను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీం, రాష్ట్ర కమిటీ సభ్యుడు శత్రుప్‌ ఘోష్‌ తీవ్రంగా విమర్శించారు. టీఎంసీకి లబ్ధి చేకూర్చేందుకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారని ఆరోపించారు. మరోవైపు నదియా జిల్లా వ్యాప్తంగా తుది ప్రచారం సుడిగాలిలా సాగింది. జిల్లాకు ఉత్తరాన పలాశీ సరిహద్దులో కాళీగంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉండగా, జిల్లా దక్షిణ భాగంలో కరీంపూర్‌, కృష్ణగంజ్‌లో నబద్వీప్‌, సరిహద్దులో మతువా ప్రాబల్యం ఉన్న ఈశాన్య ప్రాంతం లేదా శాంతిపూర్‌, హరింఘాటలో చక్దహా ఉన్నాయి. జిల్లా నుంచి తరలిన షెడ్యూల్డ్‌ కులాలు, మైనారిటీ వర్గాలు టీఎంసీ, బీజేపీలపై విశ్వాసం కోల్పోయాయి. ఇది జిల్లావ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది. నదియాలోని 4,87,519 మంది ఓటర్లలో, 2,08,626 మంది ఓటర్ల పేర్లు పెండింగ్‌ జాబితా నుంచి తొలగించబడ్డాయి. రాణాఘాట్‌ నార్త్‌ ఈస్ట్‌, రాణాఘాట్‌ సౌత్‌, కృష్ణగంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతాలను మతువాఘర్‌ అని పిలుస్తారు. ఓటు హక్కు కోల్పోయిన మొత్తం 52,500 మంది ఈ మూడు నియోజకవర్గాలకు చెందినవారే.

సర్‌ విషయంలో బీజేపీపై ఆగ్రహం
‘సర్‌’ విషయంలో బీజేపీ, టీఎంసీపై ప్రజల తీవ్ర ఆగ్రహం ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. ప్రచారం చివరి రోజున, రాణాఘాట్‌ నార్త్‌-ఈస్ట్‌ నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థి, మతువాఘర్‌లోని ఒక కార్మిక కుటుంబానికి చెందిన అమరవీరుడైన తండ్రి కుమారుడు హరిచంద్‌ గురుచంద్‌, యువకుడు మృణాల్‌ బిస్వాస్‌లపై ప్రజల విశ్వాసం స్పష్టమైంది.

అధికార పార్టీకి సవాల్‌ విసురుతున్న వామపక్ష అభ్యర్థులు
వామపక్ష మద్దతు ఉన్న ఐఎస్‌ఎఫ్‌ అభ్యర్థులు చప్రా, పలాషీ పారా నియోజకవర్గాలలోని తృణమూల్‌ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు. ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకుడు, సీపీఐ(ఎం) అభ్యర్థి సబుజ్‌ దాస్‌పై ప్రజల విశ్వాసం పెరిగింది. అదే విధంగా, రాణాఘాట్‌ నార్త్‌-వెస్ట్‌ నియోజకవర్గం నుంచి న్యాయవాది, సీపీఐ(ఎం) అభ్యర్థి దేబాశిష్‌ చక్రవర్తి, కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఎంసీలకు సవాలు విసిరారు.
కాగా శాంతిపూర్‌లో సీపీఐ(ఎం) అభ్యర్థి… ఏడాది పొడవునా ప్రజల పక్షాన నిలిచిన పోరాట నాయకుడు సౌమెన్‌ మహతో. అమరవీరుల రక్తాన్ని హంతక తృణవ¶ల్‌ అమ్ముకుంటున్న ప్రదేశాలలో శాంతిపూర్‌ ఒకటి. తేహట్టా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి సుబోధ్‌ బిస్వాస్‌. ఒక రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు ప్రజల విస్తృత మద్దతుతో చేస్తున్న ప్రచారం తృణమూల్‌, బీజేపీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. నబద్వీప్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి స్వర్ణేందు సింగ్‌కు ప్రజలు తమ మద్దతును తెలియజేస్తున్నారు. కృష్ణానగర్‌ సౌత్‌ నియోజకవర్గం సీపీఐ(ఎంఎల్‌) అభ్యర్థి లబానీ జంగీ కూడా టీఎంసీ, బీజేపీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రెండో దశ ఎన్నికల చివరి ప్రచారంలో కృష్ణానగర్‌ నార్త్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇదే చిత్రం కనిపించింది. చివరి రోజున కృష్ణానగర్‌ నగరంలోని ప్రతి వార్డులోనూ ఒక ఊరేగింపులు జరిగాయి. ఈ ఊరేగింపులో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్‌ సలీం, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుమిత్‌ డే, రాష్ట్ర కమిటీ సభ్యుడు అల్కేశ్‌ దాస్‌, శత్రుపూ ఘోష్‌, మేఘలాల్‌ షేక్‌, మాజీ ఎమ్మెల్యే సుబినోరు ఘోష్‌, ఎస్‌.ఎం. సాది తదితరులు పాల్గొన్నారు. సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన సీపీఐ(ఎం) కార్యకర్తలు, మద్దతుదారులు ఈ భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -