నూర్జహాన్ సంతాపసభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ఎస్.వీరయ్య
నవతెలంగాణ- నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
‘కమ్యూనిస్టు ఉద్యమం.. వామపక్ష శ్రేణులపై అనేక ప్రభావాలు వెంటాడుతున్న కాలమిది. కమ్యూనిస్టు ఉద్యమం తనకు తాను మరోసారి పునరుద్ధరించుకునే ప్రయత్నం, సరైన బాటలో నడిచేందుకు ఒక మధనం సాగుతున్న సమయంలో ప్రజల కార్యకర్తగా.. ఎర్రజెండ బిడ్డగా నూర్జహాన్ సమరశీల పోరాటాలు చేశారు” అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. సీపీఐ(ఎం) నిజామాబాద్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నూర్జహాన్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా.. పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో సంతాప సభ నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు అధ్యక్షత వహించగా.. సీపీఐ(ఎం)తో పాటు సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీఎల్‌పీ, ఆర్‌ఎస్‌పీ నాయకులు హాజరై నూర్జహాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. ‘నూర్జహాన్‌కు భయం లేదు. ఒకటే ధైర్యం తన చేతిలో ఎర్రజెండా ఉందని.. తన వెనుక జనం ఉన్నారని.. తాను పని చేస్తుంది శ్రామిక ప్రజలు, పేదల కోసం.. సమాజ మార్పు కోసం పని చేస్తున్నా అనుకుంది కాబట్టి భయపడలేదు. ప్రజలతో మమేకమైన నిజమైన ప్రజాకార్యకర్త..’ అని అన్నారు. ఏ కార్మికుడికైనా, ఏ కూలికైనా, ఏ కష్టజీవికైనా ఏ సమస్య వచ్చినా, ఏ రాత్రి సమస్య వచ్చినా ఆమె అక్కడ ఉండేవారని చెప్పారు. కమ్యూనిస్టు, వామపక్ష ఉద్యమం అనేక ఎదురుదెబ్బలు తింటున్న ప్రస్తుత కాలంలో ఆదర్శ మూర్తిగా ప్రజలను అంటిపెట్టుకొని నిలబడటం అందరికీ సాధ్యమైన విషయం కాదని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో పేదలను, రైతులను, కార్మికవర్గాన్ని పోరాటాల్లో భాగస్వామ్యం చేయడమే నూర్జహాన్‌కు నివాళి అవుతుందని చెప్పారు. నేడు నయా ఉదారవాద విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఎదురుదాడి జరుగుతోందన్నారు. ప్రత్యామ్నాయం ఎర్రజెండా పార్టీ విధానాలే అని బలంగా నమ్ముతూ యువత, కార్మికులు, రైతులు ముందుకు వస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శులు సుధాకర్, ఆకుల పాపయ్య, బీఎల్‌పీ రాష్ట్ర కార్యదర్శి దండివెంకట్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్దివెంకట్ రాములు, పల్లపు వెంకటేశ్, శంకర్‌గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు, కార్యకర్తలు, ఆర్‌ఎస్‌పీ నాయకులు కటారి రాములు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రజెండా ముద్దుబిడ్డ నూర్జహాన్ నూర్జహాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



