నాసిరకంగా ఆర్ అండ్ బి రోడ్డు పనులు

– మేడారం బీటీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపం
– తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు
– కాంట్రాక్టర్ల ఇష్టరాజ్యం
నవతెలంగాణ -తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా 75 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు పనులను చేపట్టారు. మేడారం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఊరట్టం క్రాస్ వరకు బిటీ రోడ్డు పనులను గుర్తెదారు చేపట్టారు. అయితే మేడారం జాతర సందర్భంగా భక్తుల వాహనాలు రద్దు పెరగడంతో గుత్తేదారు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పనులను తొందర తొందరగా క్యూరింగ్ లేకుండా చేస్తున్నాడు. తారును తొలగించి బిటి వేసేందుకు పనులను చేపట్టారు, అయితే గుంతలు పడిన రోడ్డును తొలగించాక మళ్లీ బిటి వేయాల్సి ఉండగా నాణ్యతలేని కంకర ను వేసి రోడ్డుపనులను చేపడుతున్నారు. దీంతో జాతరకు వస్తున్న భక్తులు వాహనాలు అందులో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా దుమ్ము ధూళితో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని భక్తులు ఆరోపించారు. ఈ రోడ్డును ప్రతి రెండేళ్లకోసారి మరమ్మతులు చేస్తూనే ఉన్నారు, లక్ష లక్షలు నిధులు ప్రజాధనం వేస్ట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి కాంట్రాక్టర్లను గుర్తించి బ్లాక్ లిస్టులో పెట్టాలని పూజారులు భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా బిటి రోడ్డు పనులు

మేడారంలో జాతర అభివృద్ధి కోసం చేస్తున్న బీటీ రోడ్డు పనులు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేయిస్తున్నారు పాత రోడ్డు పనులు రోడ్డును తొలగించి రోలింగ్ చేయకుండా, నాసిరకమైన కంకర పొసి, నీటితో క్యూరింగ్ చేయకుండానే పనులు నిర్వహిస్తున్నాడు. ఆర్ అండ్ బి అధికారుల జాడే లేదు. కాంట్రాక్టర్ కింది కూలి వారితో గుమస్తాల పర్యవేక్షణలో ఇష్ట రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారు. వాహనాల రాకపోకలు దుమ్ము ధూళితో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా అక్కడక్కడ పాత కార్రోడ్డును శుభ్రం చేయకుండా అలానే పోసి మామ అనిపించుకుంటున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేసి నాణ్యతగా బీటీ రోడ్డు పనులను పూర్తి చేయాలని, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న అధికారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను భక్తులు కోరుతున్నారు.

Spread the love