కల్కి మూవీ బడ్జెట్ పై ప్రభాస్ స్పందన..

నవతెలంగాణ – హైదరాబాద్: వచ్చే నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం రూపొందించామని ప్రభాస్ తెలిపారు. సినిమాలోని పేర్లు కూడా అలానే ఉంటాయని దర్శకుడు నాగ్ అశ్విన్ అన్నారు. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేశారు. ఈ సినిమా బడ్జెట్ ఎక్కువ కావడానికి గల కారణాన్ని ప్రభాస్ తాజాగా బయటపెట్టాడు. ఈ సినిమాను అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం రూపొందించామని, అందుకనే బడ్జెట్ ఎక్కువైందని తెలిపాడు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ ఈ విషయాన్ని వెల్లడించాడు. కల్కి మూవీ గ్లోబల్ రేంజ్‌లో ఉంటుందని తెలిపాడు.
సినిమాతో మరో లోకంలోకి.. దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. కల్కి సినిమా చూసిన తర్వాత మరో ప్రపంచంలోకి వెళ్లి వచ్చామన్న భావన ప్రేక్షకుల్లో కలుగుతుందని తెలిపారు. అవతార్ సినిమా చూసిన తర్వాత తాను అలాగే ఫీల్ అయినట్టు చెప్పారు. సినిమాలోని పాత్రల పేర్లు కూడా అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే పెట్టినట్టు వివరించారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతోపాటు ఇంగ్లిష్ సహా మరికొన్ని విదేశీ భాషల్లోనూ సినిమాను విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.

Spread the love