– విద్య, వైద్య రంగాలను బలోపేతం చేస్తాం
– తీ2 లక్షల ఉద్యోగ నియామకాలకు కట్టుబడి ఉన్నాం
– ధరణి సమస్యల పరిష్కారానికి సదస్సులు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
– కాళేశ్వరం పూర్తి వివరాలు ప్రజల ముందు ఉంచుతాం: ప్రొ.కోదండరామ్
నవతెలంగాణ-ఓయూ
గత ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్య అంటూ కార్పొరేట్ విద్యకు ప్రాధాన్యత ఇచ్చిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన విద్య, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉందని చెప్పారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల సోషియాలజీ (సామాజికశాస్త్రం) విభాగం హెడ్ అండ్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.చింత గణేష్ ఉద్యోగ విరమణ సందర్భంగా ”తెలంగాణ పునర్ నిర్మాణం-అభివృద్ధి దృక్ప థాలు” అంశంపై మూడ్రోజులపాటు జరగనున్న జాతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే బతుకులు మారు తాయని, విశ్వవిద్యాలయాల విద్యార్థులు, ప్రజలు ఎంతో పోరాడారని, దాని ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. కానీ రాష్ట్రం ఏర్పడిన అనంతరం వారి కలలను గులాబీ పెద్దలు కలలుగానే మిగిల్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేసి సామాన్య ప్రజలకు మంచి చేస్తామని చేసిన హామీ ప్రకారం అసెంబ్లీ సాక్షిగా కులగణన బిల్లును ఆమోదింపచేసుకున్నామని చెప్పారు. టీఎస్పీఎస్సీిని కూడా ప్రక్షాళన చేశామన్నారు. ఇప్పటికే 19 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, 2లక్షల ఉద్యోగ నియామకాలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఆశించిన విధంగా ఉద్యోగ, ఉపాధి, విద్య అందిస్తామన్నారు. ధరణి పోర్టల్‌తో రైతులు, రైతు కూలీల కు ఉన్న ఐదు గుంటలు, పది గుంటలు భూమి కూడా సమస్యలోకి నెట్టబడిందన్నారు. ప్రభుత్వ భూములను వారి సొంత భూములుగా మార్చుకోవడానికి కుట్రపూరితంగా ధరణిని ప్రవేశపెట్టారని విమర్శించారు. గత ప్రభుత్వ పెద్దలు ఎన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసారో, ఎన్ని లక్షల కోట్ల ప్రజల సొత్తును కొల్లగొట్టారో త్వరలో ప్రజలముందు పెట్టబోతున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖ, ధరణికి సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చిన 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటి పరిష్కా రానికి మార్చి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎమ్మార్వో స్థాయిలో సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రపంచ అద్భుతం నేడు కుప్ప కూలిపోతుందని..గత ప్రభుత్వ అవి నీతికి కాళేశ్వరం ఒక నిదర్శనమని అన్నారు. యూనివర్సిటీ లలో ఖాళీలను భర్తీ చేస్తామని, ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలను త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చి అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రొ.కోదండరామ్ మాట్లాడుతూ.. 6 గ్యారంటీల తో పాటుగా 7వ గ్యారంటీ అయిన రాజ్యాంగ భద్రత కాం గ్రెస్ లక్ష్యంగా చెప్పారు. కాళేశ్వరం అవినీతిపై మంత్రు లతో చర్చించి పూర్తి వివరాలు ప్రజల ముందుంచుతామ న్నారు. విద్యారంగాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, ఇకపై నూతన మార్పులు చేర్పులు చేస్తామని చెప్పారు. ప్రిన్సిపాల్ ప్రొ.చింత గణేష్ సదస్సు ఉద్దేశాన్ని వివరించారు. ఓయూ వీసీ ప్రొ.రవీందర్, సోషల్ సైన్స్ డీన్ అర్జునరావు కుతాడి, ప్రొ.పి.విష్ణుదేవ్, డా.రాంషెఫర్డ్ భీనవేని, డా.టి .శ్రీధర్ డా. వినిత్ పాండే, ప్రొ.సత్యనారాయణ, ప్రొ.చెన్న బసవయ్య, డా.రామచంద్ర మూర్తి, డా.కవిత షిండే ప్రసంగించారు.