గర్భిణీ స్త్రీలు, శిశువుల వివరాలు సేకరించాలి

Details of pregnant women and babies should be collectedనవతెలంగాణ – భిక్కనూర్
గర్భిణీ స్త్రీలు శిశువుల వివరాలను గ్రామాలలో సేకరించాలని మండల వైద్యాధికారి దివ్య తెలిపారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో రొటీన్ ఇమ్యునైజేషన్, హెడ్ కౌంట్ సర్వే వివరాలు సేకరించాలని అలాగే స్త్రీలు, శిశువుల వివరాలు, టీకాలు, టీకాలు వేసుకొని పిల్లల వివరాలు ఇంటింటికి వెళ్లి సేకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ వెంకటరమణ, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.
Spread the love