అటహాసంగా నిర్వహించేందుకు సన్నహాలు చేయాలి

– నాగవరం తండా రైతు వేదికలను సందర్శించిన కలెక్టర్‌
నవ తెలంగాణ – వనపర్తి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్‌ 3న రైతు దినోత్సవం వేడుకలు జిల్లాలో అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ ఆదేశించారు. బుధవారం ఉదయం నాగవరం తండా రైతు వేదికలో రైతు దినోత్సవ సంబరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్ల పై దిశా నిర్దేశం చేశారు. నాగావరం తాండా రైతు వేదికలో జరిగే ఉత్సవాలకు క్లస్టర్‌ నుండి 5 వేల మంది రైతులకు ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు. ఉత్సవాలకు వచ్చే రైతులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్‌ లలో, నడుచుకుంటూ డప్పు, బ్యాండ్‌ లతో వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. రైతులకు కూర్చోడానికి చలువ నీడ, తాగు నీరు, భోజనాలు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. రైతు వేదికను అందంగా అలంకరించాలని, ఎడ్ల బండి తో వచ్చే వారికి ఎడ్లకు తాగునీటి సౌకర్యం కల్పించాలని తెలిపారు. వేదిక ఏర్పాట్లు, అలంకరణ ఏర్పాట్లు, భోజనాలు తదితర అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ డి. వేణుగోపాల్‌, ఆర్డీవో పద్మావతి, వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్‌, జిల్లా ఉద్యానవన అధికారి సురేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ విక్రమ్‌ సింహా రెడ్డి, కో ఆపరేటివ్‌ అధికారిణి కాలి క్రాంతి తదితరులు ఉన్నారు.

Spread the love