సహాయానికి సిద్ధం

– కోరమాండల్‌ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో బాధితులకు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒడిశా ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే అధికారులను సంప్రదించారు. ఈ రైలు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రయాణికులు ఎవరూ లేరని ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ జోన్‌ జనరల్‌ మేనే జర్‌ తెలిపారు. అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రైల్వే అధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Spread the love