– ప్రపంచ దేశాలలో 12 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరిక
న్యూఢిల్లీ : బాస్మతి యేతర బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం గత నెలలో నిషేధం విధించడంతో అంత ర్జాతీయంగా బియ్యం ధరలు గత పుష్కర కాలంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఐక్యరా జ్యసమితి ఆహార-వ్యవసాయ
భగ్గుమంటున్న బియ్యం ధరలు సంస్థ విడుదల చేసిన బియ్యం ధరల సూచిక ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే ధరలు 19.6% పెరిగాయి. 2011 సెప్టెంబర్ తర్వాత ప్రపంచ దేశాలలో బియ్యం ధరలు ఇంతగా పెరగడం ఇదే ప్రథమం. వివిధ దేశాలలో బియ్యం ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. ఉపఖండంలో సాగు చేస్తున్న బియ్యం రకాలకు సంబంధిం చిన సూచిక జులైలో 135.4 పాయింట్లకు చేరింది. 2022-23లో దేశం నుంచి ఎగుమతి అయిన 22.35 మెట్రిక్ టన్నుల బియ్యంలో ఒక్క బాస్మతి యేతర తెల్ల బియ్యమే 9.94 మెట్రిక్ టన్నులు. ఈ స్థాయిలో ఎగుమతి అవుతున్న తెల్ల బియ్యంపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ప్రపంచ దేశాలలో ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం దేశం నుంచి 4.56 మెట్రిక్ టన్నుల బాసుమతి బియ్యం, 7.85 మెట్రిక్ టన్నుల ఉడకబెట్టిన బాస్మతి యేతర బియ్యం ఎగుమతులు మాత్రమే జరుగుతు న్నాయి. గోధుమలతో పోలిస్తే మన దేశం నుండి బియ్యం వాణిజ్యమే అత్యధికంగా జరుగుతోంది. ప్రపంచ దేశాలలో 214-215 మెట్రిక్ టన్నుల గోధుమల వాణిజ్యం జరగగా అందులో భారత్ వాటా చాలాస్వల్పం. 2021-22లో మాత్రం గరిష్టంగా 7.24 మెట్రిక్ టన్నుల వాణిజ్యం జరిగింది. గత సంవత్సరం మేలో గోధుమ ఎగుమతులపై భారత్ నిషేధం విధించినప్పటికీ అంతర్జాతీయ ధరలపై దాని ప్రభావం పెద్దగా పడలేదు.