ప్రొ బాస్కెట్‌బాల్‌ లీగ్‌ షురూ

హైదరాబాద్‌ : ఎలైట్‌ ఉమెన్‌ ప్రొ బాస్కెట్‌బాల్‌ లీగ్‌ నగరంలోని డ్రీమ్‌ బాస్కెట్‌బాల్‌ అకాడమీలో శుక్రవారం ఆరంభమైంది. హైదరాబాద్‌లోని ప్రతిభావంతులైన బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణీలను వెలికి తీసేందుకు నిర్వహిస్తున్న ఈ లీగ్‌ పోటీల్లో సుమారు 250 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. ఆదివారం వరకు జరుగనున్న ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన అథ్లెట్లు ఈ ఏడాది ఆఖర్లో జాతీయ స్థాయి ఎలైట్‌ ఉమెన్‌ ప్రొ బాస్కెట్‌బాల్‌ లీగ్‌ పోటీలకు అర్హత సాధించనున్నారు.

Spread the love