పెండింగ్ పనులలో  పురోగతి తీసుకురావాలి

 – కలెక్టర్ హరిచందన  దాసరి 
 నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ 
తహసిల్దార్లు రెవిన్యూ అంశాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులను 15 రోజుల్లో పురోగతి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆమె తహసిల్దార్లతో రెవెన్యూ అంశాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2023 -24 వానకాలం కష్టం మిల్లింగ్ రైసు (సి ఎం ఆర్)  చెల్లింపు,  యాసంగి ధాన్యం  కొనుగోలు కేంద్రాల నిర్వహణ, లోక సభ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, పివో, ఏపీఓలు, ఇతర పోలింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు, పోలింగ్ కేంద్రాల పెయింటింగ్ తదితర అంశాలపై సమీక్షించారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆర్డీవోలు, తహసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love