నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో గౌరారం గ్రామస్తులు గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మా గ్రామానికి సంబంధించిన అటవీ భూమి ఎక్కడ వరకు ఉందో అటవీశాఖ వారు హద్దులు చూపించాలని, మేము మా గ్రామస్తులం మా గ్రామ శివారులోని అడవులను పరిరక్షించుకుంటామని, సంబంధిత జిల్లా అటవీ శాఖ అధికారికి మరియు జిల్లా కలెక్టర్ దరఖాస్తులు పంపారు. అలాగే మా గ్రామ శివారులో వేరే గ్రామాల వారు అటవీ భూముల్లో పంటలు సాగు చేస్తున్నారని, వానాకాలంలో పంటలు సాగు చేస్తున్న పంటలను ధ్వంసం చేయాలని అలా చేస్తే మరోసారి మా అటవీ భూముల్లో పంటలు సాగు చేయాలని గ్రామస్తులు ముక్తకంఠంతో మండల అటవీ శాఖ అధికారులకు విన్నవించారు. త్వరగా మా గ్రామ అటవీ శివారు హద్దులు చూపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు బంజారా శంకర్ మాజీ ఎంపీటీసీ సభ్యుడు అంజయ్య మాజీ సర్పంచ్ అంజయ్య గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.