అందుకే జైల్‌భరోలో పాల్గొంటాం
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మికుల ఉద్యోగుల ఉద్యోగ భద్రత, హక్కుల సాధన కోసం ఈ నెల 10న దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న జైల్‌భరో కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొంటారని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) తెలిపింది. ఈ మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌కి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె సునీత, పి జయలక్ష్మి, కోశాధికారి పి మంగ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం పద్మశ్రీ వినతి పత్రాన్ని సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులు, సౌకర్యాలపై దాడి చేస్తూ యజమానులకు ప్రయోజనం కల్గించే విధంగా నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఆ కోడ్‌లతో కార్మికులు, ఉద్యోగులపై పని భారం పెరుగుతుందని తెలిపారు. జీతభత్యాలు పెరగవనీ, ఉద్యోగ భద్రత ఉండదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని గర్తు చేశారు. ఉపాధి హామీ చట్టంలో మార్పులు చేశారనీ, నూతన విద్యా విధానం వల్ల విద్యా రంగం పూర్తిస్థాయి కార్పొరేటీకరణ అవుతోందనీ, విద్యుత్ సవరణ బిల్లు వల్ల వినియోగదారులపై భారం పడుతోందని పేర్కొన్నారు. వీటన్నింటికీ నిరసనగా కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 10న జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ స్కీముల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగ భద్రత కోసం నిరసన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



