నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ తమను వెంటనే క్రమబద్ధీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం యూనివర్సిటీ లోని ఆర్ట్స్ కళాశాల ఎదుట వంటి కాలుపై నిలుచుని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ గ్రూప్స్ సంఘం జాక్ రాష్ట్ర కో కన్వీనర్ డాక్టర్ దత్తహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్టు పదం ఉండదన్న ముఖ్యమంత్రి కేసిఆర్ తమను నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతూ చాలి చాలని వేతనాలతో తమ కుటుంబాలు అప్పుల పాలై వీధిన పడుతున్నాయని ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రాష్ట్రంలోని 12 యూనివర్సిటీ లలో 15 నుంచి 20 ఏళ్లుగా పనిచేస్తున్న 1335 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరేషన్ చేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దేవరాజు శ్రీనివాస్, డాక్టర్ వి జలంధర్, డాక్టర్ గంగా కిషన్, డాక్టర్ శరత్, డాక్టర్ నాగేశ్వర రావు, డాక్టర్ డానియల్, డాక్టర్ సిఎస్ శ్రీనివాస్, డాక్టర్ స్వామి రావు, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు