ప్రజా సంక్షేమ ప్రభుత్వం..కేసీఆర్ ప్రభుత్వం

– వైస్ ఎంపీపీ చెలుకల సభిత
– మండలంలో ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు
– వడ్లను కొననియ్యని చరిత్ర బీజేపీ ప్రభుత్వానిది..
నవతెలంగాణ-బెజ్జంకి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన పలు అభివృద్ధి పనులు భావితరాలకు సత్పలితాలిస్తాయని..  ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రజల మన్నలను పొందుతోందని వైస్ ఎంపీపీ చెలుకల సభిత అన్నారు.శనివారం మండలంలోని బెజ్జంకి,పెరుకబండ,గాగీల్లపూర్,దాచారం,కల్లేపల్లి, బేగంపేట గ్రామాల్లోని రైతు వేదికల్లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఎంపీపీ నిర్మల,జెడ్పీటీసీ కనగండ్ల కవిత,వైస్ ఎంపీపీ చెలుకల సభిత,ఇంచార్జీ ఎంపీడీఓ అంజయ్య అద్వర్యంలో రైతు,వేదికల్లో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.దాచారం గ్రామంలో మహిళలు బతుకమ్మ,బోనాలు,ఎండ్ల బండ్లతో గ్రామ పంచాయతీ కార్యలయం నుండి రైతు వేదిక వరకు ర్యాలీ నిర్వహించారు.రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీశ్ రావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ సంబురాలు జరుపుకున్నారు.రైతు దినోత్సవ వేడుకల్లో అయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,ఎఎంసీ పాలకవర్గం సభ్యులు,రైతు సమన్వయ సమితి సభ్యులు,ప్రత్యేకాధికారులు,వ్యవశాఖాధికారులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు,బీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు,మహిళలు,రైతులు పాల్గొన్నారు.

Spread the love