జిల్లా ఓటర్ జాబితా ప్రచురణ

నవతెలంగాణ భువనగిరి రూరల్: జిల్లాకు సంబంధించిన భువనగిరి, ఆలేరు నియోజక వర్గాల తుది ఓటర్ల జాబితా ప్రచురించడం జరిగిందని జిల్లా కలెక్టరు హనుమంతుకే జెండగే గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 94- భువనగిరి అసెంబ్లీ నియోజక వర్గానికి సంబంధించి పురుషులు 1,08,598 మంది, మహిళలు 1,11,358 మంది, ఇతరులు 1, మొత్తం కలిపి 2 లక్షల 19 వేల 957 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 97- అలేరు అసెంబ్లీ నియోజక వర్గానికి సంబంధించి పురుషులు 1,16,344 మంది, మహిళలు 1,17,497 మంది, ఇతరులు 19, మొత్తం కలిపి 2 లక్షల 33 వేల 860 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. రెండు అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి పురుషులు 2,24,942 మంది, మహిళలు 2,28,855 మంది, ఇతరులు 20, మొత్తం 4 లక్షల 53 వేల 817 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.

Spread the love