
భిక్కనూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయం తో పాటు 18 గ్రామ పంచాయతీలలో శుక్రవారం రెండవ సాధారణ ఎన్నికలలో భాగంగా ఓటరు జాబితాను వార్డుల వారిగా ప్రచురించడం జరిగిందని ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి తెలిపారు. గ్రామ ప్రజలు ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రచురించిన ఓటరు జాబితాను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే గ్రామ కార్యదర్శికి తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయ సి ఓ లు, పంచాయతీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.