పుష్ప ఫేమ్ నటుడుకి గుండెపోటు

నవతెలంగాణ – హైదరాబాద్: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే గుండెపోటుకు గురయ్యాడు. ప్రస్తుతం ముంబైలో సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న శ్రేయాస్ తన షాట్ ముగించుకుని ఇంటికి వెళ్లిన తర్వాత గుండె నొప్పితో కుప్పకూలిపోయారు. ఆయన్ని వెంటనే బెల్లెవో హాస్పిటల్ కి తరలించారు. రోజంతా చాలా యాక్టీవ్ ఉంటాడు, సడన్ గా ఇలా అయ్యేసరికి చిత్ర యూనిట్ కూడా షాక్ కి గురైంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప : ది రైజ్’ మూవీలో పుష్పరాజ్ పాత్రకి డబ్బింగ్ చెప్పింది కూడా శ్రేయాస్ తల్పాడేనే. ఇప్పుడు ‘పుష్ప : ది రూల్’ సినిమాలో బన్నీ పాత్రకి డబ్బింగ్ చెబుతున్నారు.

Spread the love