పి.వి సింధు దూరం

pv sindhu– థామస్‌, ఉబెర్‌ కప్‌ జట్ల ప్రకటన
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్‌, ఉబెర్‌ కప్‌లకు భారత జట్లను బారు (భారత బ్యాడ్మింటన్‌ సంఘం) గురువారం ప్రకటించింది. ఏప్రిల్‌ 27 నుంచి మే 5 వరకు చైనాలోని చెంగ్డూలో జరిగే ఈ టోర్నీలో మెన్స్‌ జట్టు డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. అగ్ర షట్లర్‌ పి.వి సింధు పారిస్‌ ఒలింపిక్స్‌ సన్నద్ధత కోసం ఉబెర్‌ కప్‌కు దూరమైంది. థామస్‌ కప్‌లో పది జట్లు షట్లర్లకు చోటు దక్కగా అందులో ఐదుగురు సింగిల్స్‌ ప్లేయర్లు ఉన్నారు.
థామస్‌ కప్‌: హెచ్‌.ఎస్‌ ప్రణరు, కిదాంబి శ్రీకాంత్‌, ప్రియాన్షు రజావత్‌, కిరణ్‌ జార్జ్‌ (సింగిల్స్‌). సాత్విక్‌సాయిరాజ్‌,చిరాగ్‌ శెట్టి, ఎంఆర్‌ అర్జున్‌, ధ్రువ్‌ కపిల, సాయి ప్రతీక్‌ (డబుల్స్‌) ఉబెర్‌ కప్‌ : అన్మోల్‌, తన్వీ శర్మ, అష్మిత చాలిహ, ఇషారాణి (సింగిల్స్‌). శృతి మిశ్రా, ప్రియా, సిమ్రన్‌, రితిక (డబుల్స్‌)

Spread the love