హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

నవతెలంగాణ – హైదరాబాద్
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తున్నది. ఎల్బీ నగర్‌, కొత్తాపేట, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, నాంపల్లి, లక్డీకపూల్‌, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అంబర్‌పేట, నారాయణగూడ, ఓయూ, కోఠి, తిరుమలగిరి, సికింద్రాబాద్‌ తదిరత ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. నగరం మొత్తం మేఘావృతమై ఉన్నది. నగరంలో ఆదివారం సాయంత్రం కూడా భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. పలుప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు విరిగాయి.

Spread the love