ప్రజాపాలన కౌంటర్లను పరిశీలించిన బోధన్ ఆర్డీవో రాజా గౌడ్ 

నవతెలంగాణ రెంజల్: మండల కేంద్రం రెంజల్ తో పాటు బాగేపల్లి గ్రామాలలో బోధన్ ఆర్డీవో రాజా గౌడ్ ప్రజా పాలన కౌంటర్లను పరిశీలించారు. మండలంలోని ప్రజాపాలన ఏ విధంగా కొనసాగుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తు ఫారంపై ఎలాంటి కొట్టివేతలు లేకుండా సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలన్నారు. ఆయనతోపాటు తాహశీల్దార్ రామచందర్, ఎంపీడీవో శంకర్, సూపరిండెంట్ శ్రీనివాస్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రవికుమార్, గ్రామ కార్యదర్శిలు రాజేందర్ రావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love