రాజన్న గుట్ట ఆలయ స్థలాన్ని కాపాడాలి

– ఖానాపూర్‌ గ్రామస్తుల ఆవేదన
– ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌కు వినతి
నవతెలంగాణ-గండిపేట్‌
చరిత్ర కలిగిన 3 వందల సంవత్సరాలు కలిగిన ( రాజన్న గుట్ట) శివాలయం స్థల వేలాన్ని తిరిగి గుడి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం గండిపేట్‌ మండలం నార్సింగి మున్సిపాలిటీ ఖానాపూర్‌ గ్రామస్తులు మాజీ ఎంపీపీ తలారి మల్లేష్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌కు గ్రామస్తుల తరుపున విన్నతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూరతన అలయాలను కేసీఆర్‌ ప్రభుత్వం పరిరక్షించాలని కోరారు. ప్రభుత్వం వేసిన వేలంలో చరిత్ర కలిగిన శివాలయం స్థలాన్ని అమ్మడం దారుణమన్నారు. చరిత్ర కలగిన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడం సరైనది కాదన్నారు. ఖానాపూర్‌ రాజన్నగుట్ట శివాలయ స్థలం దాదాపు ఐదు ఏకరాల వరకు ఉందన్నారు. గుడి స్థలాన్ని గుడికే కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున గ్రామస్తుల తరుపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కోకాపేట్‌ సర్వే నంబర్‌ 239,240 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిలో చరిత్ర కలిగిన రాజన్న గుట్ట స్థలాన్ని ప్రతి ఒక్కరు కాపాడుకోవాలన్నారు. చారిత్రకమైన శివాలయ భూములను హెచ్‌ఎండీఎ అధికారులు వేలం వేయడం క్షమించరాని నేరమన్నారు. వారం రోజుల్లో పరిష్కరిస్తామన్న అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే వేంటనే సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే పెద్ద ఎత్తున అందోళన చేస్తామని హెచ్చరించారు. ఎహెచ్‌ఎండీఎ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హమీచ్చారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ తలారి మల్లేష్‌, నాయకులు దుద్దాల లక్ష్మీనారాయణ, మన్నే సురేష్‌, వెంకటేష్‌, శివరాజు, విట్టల్‌రెడ్డి, రాజు, శ్రీనివాస్‌, ధన్‌రాజు, లక్ష్మయ్య తదితరులు ఎమ్మెల్యేను కలిసిన వారిల్లో ఉన్నారు.

Spread the love