రాళ్లమయం ఐన రంగాపురం రహదారి

– గుత్తేదారు పట్టించుకోడు అధికారుల అడ్రస్ ఉండదు
– స్కూల్ పిల్లలు ఆసుపత్రి రోగులకు తప్పని తిప్పలు
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని రంగాపురం రహదారి పూర్తిగా రాళ్లమయం అయింది. గతంలో కురిసిన భారీ వర్షాలకు రహదారి ఎక్కడికక్కడకు ధ్వంసం కాగా మరమ్మత్తుల కోసం కొత్తగా గుత్తేదారు రహదారి నిర్మాణం ప్రారంభించి పూర్తి చేయకుండానే వదిలేశారు. గ్రామస్తులు అడిగితే గుత్తేదారు నుండి ఎలాంటి సమాధానం లేదని అధికారులను అడిగితే తీసివేసినట్టుగా మాట్లాడుతున్నారని గ్రామస్తులు తెలుపుతున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు వారి సైకిళ్లు మరియు పాఠశాల బస్సు గ్రామానికి అత్యవసరంగా 108 అంబులెన్స్ రావాలన్న ఇతర గ్రామాలకు వెళ్లే వాళ్లకు వారి వాహనాలకు ప్రయాణికులకు రోగులకు ఈ రహదారి ఒక శాపంగా మారింది. దీనిని వెంటనే త్వరితగతిని పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ద్విచక్ర వాహనదారులు సైకిళ్లు పలుమార్లు స్లిప్ కావడం వల్ల పడి దెబ్బలు తగులుతున్నాయని యువకులు వాపోతున్నారు. అమ్మో రంగాపురం రోడ్డు అంటేనే ఇతర గ్రామాల ప్రజలు జెడిసిపోతున్నారు రంగాపురం వెళ్లాలంటే వాహనాలపై సర్కస్ ఫీట్లు చేయాల్సిందేనని అంటున్నారు అంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవాలి. సంబంధిత అధికారులను సమాచారం అడిగిన ఇవ్వడం లేదని గుత్తేదారును పనులకు పురమాయించాల్సిన బాధ్యత లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. తాము గుత్తేదారులు అడిగితే మీకు చేతనైంది చేసుకోమని అంటున్నారని ప్రజలు తెలుపుతున్నారు. రహదారిని వెంటనే పూర్తి చేయాలి భూక్య తిరుపతి రంగాపూర్ గ్రామస్తుడు సంబంధిత గుత్తేదారు మరియు అధికారులు స్పందించి రంగాపురం రహదారి పనులను వెంటనే పూర్తి చేయాలని బి టి వేయాలని లేదా మొరం పోసి రోలర్ తో నీరు పోస్తూ లెవెల్ చేసినట్లయితే రంగాపూర్ గ్రామస్తుల కష్టాలు గట్టేకుతాయి.
Spread the love