గడువులోగా రా రైస్‌ ఎఫ్‌సీఐకి ఇవ్వాలి

– కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రైతుల శ్రేయస్సుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి చెప్పారు. 2021-22 రబీ సీజన్‌కు 15లక్షల మెట్రిక్‌ టన్నుల పార్‌ బాయిల్డ్‌ రైస్‌ను తెలంగాణ రైతుల నుంచి సేకరించేలా అనుమతులు మంజూరు చేయాలంటూ తాను కేంద్రానికి లేఖ రాసినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందుకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పందించారని తెలిపారు. మొత్తం 13.73 లక్షల మెట్రిక్‌ టన్నుల పార్‌ బాయిల్డ్‌ రైస్‌ సేకరణకు, లక్ష్యానికి తగినట్టుగా మిగిలిన బియ్యాన్ని రా రైస్‌ రూపంలో నిర్ధేశించిన గడువులోపు ఎఫ్‌సీఐకి అందజేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

Spread the love