‘ఎర్ర పుస్తకం’ వర్ధిల్లాలి

The 'red book' should flourishప్రతీ అక్షరం ఓ చైతన్యం
ప్రతీ పదం ఓ ప్రజ్వలనం
ప్రతీ పాదం ఓ ఉద్దీపనం
ప్రతీ భావం ఓ ఉత్ప్రేరకం
అదే విప్లవించే ఎర్ర పుస్తకం

కార్మిక కర్షక శ్రామికులకు
పోరు పాఠం ప్రబోధిస్తుంది
కష్టజీవులు కర్మవీరులకు
రణ తంత్రం మంత్రిస్తుంది
తాడిత పీడిత వర్గాలకు
విప్లవ దారి చూపిస్తుంది

మూగబోయిన గళాలకు
ధిక్కార శృతి నేర్పిస్తుంది
సామాజిక అసమానతల
దొంతరలను పూడ్చేందుకు
సాహసాన్ని నూరిపోస్తుంది
అంధకారమైన బతుకుల్లో
క్రాంతి దీప్తిలా ప్రభవిస్తుంది

సామ్రాజ్యవాద పోకడలపై
నిరసన స్వరమై గర్జిస్తుంది
పెట్టుబడిదారుల గుండెల్లో
రగల్‌ గునపమై దిగుతుంది
మహా వీరుల జీవితగాథల
కళ్లెదుట సాక్షాత్కారం చేసి
సమ సమాజ నిర్మాణానికి
సబ్బండవర్గాల కదిలిస్తుంది
మరో మహోదయం దిశగా
మానవాళిని మల్లిస్తుంది

విముక్తి చిహ్నమా !
ఎర్రెర్రని పుస్తకమా ..!!
శ్రామిక పోరాటాల వందనం
విముక్తి ఉద్యమాల సెల్యూట్‌

(ఫిబ్రవరి 21 ”రెడ్‌ బుక్స్‌ డే” సందర్భంగా)
– కోడిగూటి తిరుపతి
9573929493

Spread the love