నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లోని ఓల్డ్ బాయ్స్ హాస్టల్ ను మంగళవారం ఆకస్మికంగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.యాదగిరి తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం హాస్టల్ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి వంట గదిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. హాస్టల్ పరిసర ప్రాంతాల్లో నీరు నిలువ ఉండకుండా చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని దోమల నివారణకు కిటికీలకు జాలీలను సరి చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.నాణ్యమైన భోజనం అందించడంలో హాస్టల్ సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. విద్యార్థులకున్న సమస్యలను సావధానంగా విని పరిష్కారాలను చర్చించినారు.ఈ కార్యక్రమం లో ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్, ఇంజనీర్ వినోద్, చీఫ్ వార్డెన్ డాక్టర్.మహేందర్ ఐలేని,ఎస్టేట్ ఆఫీసర్ అశోక్ వర్ధన్ రెడ్డి, కేర్ టేకర్స్ క్రాంతి కుమార్, దిగంబర్ చౌహాన్, రమేష్, హాస్టల్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.