
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు పట్ల సన్న వడ్లకు రూ.500 బోనస్ ప్రకటించినందున ఇతర రాష్ట్రాల నుండి వరి ధాన్యం అక్రమంగా మన రాష్ట్రంలోకి రాకుండా.. మన రాష్ట్ర సరిహద్దు మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ సమీపంలోని మహారాష్ట్ర బార్డర్ సరిహద్దులో చెక్పోస్ట్ వద్ద అధికారులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు రాష్ట్ర సరిహద్దులో ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రంలోకి వచ్చే వాహనాలకు తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు, ఏ ఈ ఓ భజన, రికార్డు అసిస్టెంట్, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ సిబ్బంది తనిఖీ లో పాల్గొన్నారు.