ఈసెట్ ఫ‌లితాల విడుద‌ల‌..

నవతెలంగాణ- హైదరాబాద్: ఏపీ ఈసెట్ ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. గురువారం ఉద‌యం అనంత‌పురం జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) లో ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్ కే. హేమ‌చంద్రా‌రెడ్డి, ఈసెట్ ఛైర్మ‌న్ శ్రీనివాస‌రావు ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఈసెట్ ఫ‌లితాల్లో 90.41 శాతం మంది ఉత్తీర్ణులైన‌ట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ఫ‌లితాల‌ను పొందవచ్చ‌ని అధికారులు వెల్ల‌డించారు.

Spread the love