హత్యాయత్నానికి పాల్పడుతున్న పలువురికి రిమాండ్‌

– కంట్రీమ్‌ మేడ్‌ పిస్తోల్‌, 5 రౌండ్ల బుల్లెట్లు,కత్తులు స్వాధీనం
– సమావేశంలో బాలానగర్‌ ఏసీపీ గంగారాం వెల్లడి
నవతెలంగాణ-బాలానగర్‌
పాత కక్షలను మనసులో పెట్టుకుని తన అన్నను చంపిన వ్యక్తులను చంపేందుకు ప్రయత్నిస్తున్న రెండు గ్యాంగులను బాలానగర్‌ ఎస్‌ఓటీ, జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అదుపులోనికి తీసుకుని సోమవారం రిమాండ్‌కు తరలించారు. బాలానగర్‌ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ గంగారాం వివరాలను వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాజేష్‌ సమాచారం మేరకు నిందితుల వద్ద నుండి కంట్రీ మేడ్‌ పిస్టల్‌ తోపాటు,5 రౌండ్ల బుల్లెట్స్‌, బొమ్మ తుపాకీ, కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు బాలానగర్‌ ఏసీపీి గంగారం వెల్లడించారు. వివరాల్లోకి వెళితే 2021 లో నవాజ్‌ అనే వ్యక్తిని హత్య చేసిన లెనిన్‌ నగర్‌ జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన షేక్‌ ఇమ్రాన్‌, మహమ్మద్‌ ఖలీద్‌ పటేల్‌, తెల్ల శ్రీకాంత్‌, గిరినగర్‌ ప్రాంతానికి చెందిన రోహిత్‌ సింగ్‌ ల పై మతుడి తమ్ముడు ఆయాజ్‌ కక్ష పెంచుకుని హత్య చేసేందుకు ప్రయత్నించడంతో పాటు గ్యాంగ్‌లుగా విడిపో యి దాడులకు పాల్పడేందుకు యత్నిస్తున్నారన్న పక్క సమాచారంతో తనిఖీలు చేపట్టి 2 గ్యాంగ్‌ లను అతి చాక చక్యంగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందులో మతుడు నవాజ్‌ తమ్ముడు ఆయాజ్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలియజేశారు. గతంలో జగద్గిరిగుట్ట, బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్లలో నిందితుల పై పలు కేసులు ఉన్న నేపథ్యంలో వారి పై పీడీ యాక్ట్‌ నమోదుకు సిఫార్స్‌ చేస్తామని ఏసీపీ గంగారాం తెలిపారు.

Spread the love