ఉద్యమనేత ఆర్ వి మహేందర్ కుమార్ ఆధ్వర్యంలో గోషామహల్ లో భారీ బైక్ ర్యాలీ..   

నవతెలంగాణ- సుల్తాన్ బజార్                          
తెలంగాణ ఉద్యమ నేత గోషామహల్ నియోజకవర్గం సీనియర్ బీఆర్ఎస్ నాయకులు ఆర్ వి మహేందర్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం కోఠి బ్యాంక్ స్టేట్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి బేగంబజార్ లోని భూలక్ష్మి మాత ఆలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా జై తెలంగాణ.. జై జై తెలంగాణ నినాదాలు చేస్తూ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు కోఠి బ్యాంక్ స్ట్రీట్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ హనుమాన్ టేక్డి, హనుమాన్ వ్యాయామశాల, కోఠి తిలక్ పార్క్, ఇసామియా బజార్, రంగ్ మహల్ చౌరస్తా, గౌలిగూడ, అఫ్జల్ గంజ్ మీదుగా బేగంబజార్ లోని భూ లక్ష్మీ మాత ఆలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఉద్యమ నేత ఆర్వీ మహేందర్ కుమార్ భూలక్ష్మి మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీ ప్రారంభమై జుమ్మెరాత్ బజార్ లోని సిత్లామాత ఆలయం వరకు, అక్కడినుండి దూల్పేట్ లోని మహంకాళి ఆలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయాల్లో తెలంగాణ ఉద్యమ నేత ఆర్మీ మహేందర్ కుమార్ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి రాబోయే ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరిగి ప్రారంభమైన బైక్ ర్యాలీ మంగళ్ హాట్, గోషామహల్, చాక్నా వాడి, హిందీ నగర్, ఎంజీ మార్కెట్ చౌరస్తా, ట్రూప్ బజార్ల మీదుగా తిరిగి కోఠి బ్యాంక్ స్ట్రీట్లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకుంది. ఈ బైక్ ర్యాలీలో బిఆర్ఎస్ నాయకులు రవీంద్ర చారి, ఈశ్వర్, రాజేందర్, కన్నా, శ్రీనివాస్, తోట శ్రవణ్, ప్రభు, పవన్, ఆర్ వీ వినోద్ కుమార్, విష్ణు, ప్రసాద్, రామస్వామి లతోపాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love