సిలబస్‌ నుంచి సీపీఐ, డీఎంకే అంశాల తొలగింపు

– రామజన్మభూమి, బీజేపీపై పాఠాలు చేర్చిన ఎన్‌యూ వర్సిటీ
– విశ్వవిద్యాలయ తీరుపై విద్యావేత్తల ఆందోళన
న్యూఢిల్లీ: నాగ్‌పూర్‌ యూనివర్శిటీ (ఎన్‌యూ) తీరు వివాదాస్పదమవుతున్నది. ఎం.ఏ హిస్టరీ సిలబస్‌లో బీజేపీ గురించి ఒక అంశంగా చేర్చింది. ఇంతవరకు సిలబస్‌లో ఉన్న కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(సీపీఐ), ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) విభాగాలను తొలగించడానికి చర్యలు తీసుకుంటు న్నది. విశ్వవిద్యాలయం తీరుపై ఇటు విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వం లోని ప్రభుత్వాలు విద్య విషయంలోనూ రాజకీయా లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డీఎంకే ఔట్‌.. ఏఐఏడీఎంకే ఇన్‌
మునుపటి పాఠ్యాంశాల్లో జన్‌ సంఘ్ పై విభా గాలు, రిపబ్లికన్‌ పార్టీపై ఒక అధ్యాయం కూడా అలా గే ఉంచబడింది. అయితే ‘కాంగ్రెస్‌ భాగస్వామి’, తమిళనాడులోని అధికార డీఎంకేకు సంబంధించిన అంశాలను తొలగించటం గమనార్హం. దీనిని అదే తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం, ఎన్డీయేఏలో భాగస్వామి ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజ గం (ఏఐఏడీఎంకే)తో భర్తీ చేయబడటం గమనా ర్హం. ఇక ఖలిస్తాన్‌ ఉద్యమంపై ఒక అధ్యాయం తొల గించబడింది. రామజన్మభూమి ఉద్యమంపై దృష్టిసా రించే ”1980-2000 నుంచి భారతీయ ప్రజా ఉద్య మాలు” అనే కొత్త అధ్యాయం కూడా చేర్చ బడింది.
గతంలోనూ ఇలాగే
2019లో విశ్వవిద్యాలయం నాలుగో సెమిస్టర్‌ కోసం బీ.ఏ హిస్టరీ సిలబస్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు(ఆరెస్సెస్‌)పై ఒక అధ్యాయాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఇలాంటి వివాదాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వివాదం చెలరేగే అవకాశమున్నదని తెలిసినప్పటికీ.. విశ్వవిద్యాలయం ఈ విధంగా వ్యవహరించటాన్ని విద్యావేత్తలు, నిపుణులు తప్పుబడుతున్నారు.
‘తప్పుడు విషయాలను బోధించలేం’
కాగా, ఈ కొత్త సిలబస్‌ను ఎన్‌.యూ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ (చరిత్ర) చైర్మెన్‌ శ్యామ్‌ కోరెట్టి రూపొందిం చారు. ”మేము సీపీఐ జాతీయ పార్టీగా లేనందున దాన్ని తొలగించి, జాతీయ స్థాయిలో పట్టు ఉన్నప్ప టికీ పాత సిలబస్‌లో లేని బీజేపీని చేర్చాం. మేము 2010 వరకు మాత్రమే బీజేపీ చరిత్రను చేర్చాము. విద్యార్థులకు తప్పుడు విషయాలు బోధించలేము” అని కోరెట్టి అన్నారు.ఈ ఏడాది ఎన్‌.యూ విభాగా ల్లో అమలు చేసిన నూతన విద్యా విధానం (ఎన్‌ఈ పీ)కి కట్టుబడి ఉండాలని కోరెట్టి ఉద్ఘాటించారు.
‘బీజేపీ భావజాలాన్ని రుద్దుతున్నారు’
మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విజరు వాడెట్టివార్‌ ఈ చర్యను విమర్శించారు. ”వారు (బీజేపీ) వారి భావజాలమైన కులతత్వం, మతం, ద్వేషాన్ని పౌరులపై రుద్దుతున్నారు. బీజేపీని స్థాపించిన ఆరెస్సెస్‌ మహిళలను ఎప్పుడూ గౌరవించలేదు. బీజేపీ గురించి ఏం నేర్పాలి?” అని విజరు వాడెట్టివార్‌ అన్నారు.

Spread the love