సీపీఐ నేతలతో కేజ్రీవాల్‌ భేటీ

న్యూఢిల్లీ: ప్రజా ప్రభుత్వ అధికారాల ను హరించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై న్యాయ పోరాటానికి ఆమాద్మీ పార్టీ (ఆప్‌) మద్దతు సమీకరిస్తోంది. ఈ క్రమంలో బుధవారం నాడు సీపీఐ నేతలతో ఢిల్లీ ముఖ్య మంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సమావేశమయ్యారు. ఇందు కోసం ఢిల్లీలోని సిపిఐ ప్రధాన కార్యాల యానికి వెళ్లిన ఆయన సీపీఐ ప్రధానకార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శి కె నారాయణ తదితరులతో భేటీ అయ్యారు. అనంతరం ఇరు పార్టీల నేతలు సీపీఐ కార్యాలయం వెలుపుల అభివాదం చేస్తూ ఫొటోలు దిగారు. ఆప్‌ చేస్తున్న న్యాయపోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా డి రాజా పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తిని మోడీ సర్కార్‌ మంటగలుపుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు తెలిపిన సీపీఐ నేతలకు కేజ్రీవాల్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love