నవశరణ్‌ సింగ్‌పై ఈడీ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం

– 350 మందికిపైగా విద్యావేత్తలు, పౌర సంఘం సభ్యుల లేఖ
న్యూఢిల్లీ: పరిశోధకురాలు, రచయిత, కార్యకర్త అయిన డాక్టర్‌ నవశరణ్‌ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారిం చటంపై పౌర సమాజం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. నవశరణ్‌ సింగ్‌పై ఈడీ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు భారతీయ విద్యా వేత్తలు, పరిశోధకులు, న్యాయ నిపుణు లు, కళాకారులు, పౌర సంఘం సభ్యులు పే ర్కొన్నారు. దాదాపు 350 మందికి పైగా తమ సంతకాలతో కూడిన ఒక లేఖను విడుదల చేశారు. ఇందులో వారి ఆందోళనలను, అసం తృప్తిని వ్యక్తం చేశారు. ‘ఇటీవల సంవత్సరా లలో ఇతర విద్యావేత్తలు, మానవ హక్కు ల కార్యకర్తలను ప్రశ్నించే పద్దతిలో నవశరణ్‌ సింగ్‌ను ఈడీ సుదీర్ఘంగా విచా రించినట్టు కనిపిస్తున్నది. పీఎంఎల్‌ఏ భారత ప్రజాస్వా మ్యానికి చీకటి మచ్చ” అని లేఖలో వారు వివరించారు. వ్యవసాయం, మహిళల హక్కు లు, రైతులు, శాంతి వంటి అంశాలలో నవ శరణ్‌సింగ్‌ అత్యున్నత సమగ్రత కలిగిన పరిశో ధకులని నొక్కి చెప్పారు. రాజ్యాంగ విలువలను సమర్థించిన ఇలాంటి వ్యక్తిపై వేధింపులు నిలిపివేయాలని ప్ర భుత్వం, ఈడీని వారు డిమాండ్‌ చేశారు. మనీలాండ రింగ్‌ చట్టం (పీఎం ఎల్‌ఏ) కింద నవశరణ్‌ సింగ్‌ను ఈడీ గతనెల 10న విచారించిన విషయం విదితమే. మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా నవశరణ్‌సింగ్‌ పో రాడారు. హక్కుల కార్యకర్త అ యిన హర్ష్‌ మందర్‌ నేతృత్వం లోని అమన్‌ బిరాదారి బోర్డులో వీరు సభ్యులుగా ఉన్నారు.

Spread the love