సోషలిస్టు, సెక్యులర్‌ పదాల తొలగింపు

Removal of the words socialist and secular– కొత్త పార్లమెంట్‌లో ఎంపీలకు ఇచ్చే రాజ్యాంగ ప్రతుల్లో గాయబ్‌
– ప్రతిపక్షాల ఆగ్రహం
పార్లమెంట్‌ కొత్త భవనంలోకి ఎంపీలు అడుగుపెట్టిన సమయంలో వారికి భారత రాజ్యాంగ ప్రతులను అందించారు. అయితే అందులోని పీఠికలో సోషలిస్టు, సెక్యులర్‌ పదాలు లేకపోవడం వివాదస్పదమయ్యింది. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. వాటిని తొలగించడం రాజ్యాంగంపై దాడేనని ధ్వజమెత్తారు. ఎంపీలకు (మంగళవారం) ఇచ్చిన రాజ్యాంగ కొత్త కాపీల్లోని పీఠికలో సోషలిస్టు, సెక్యులర్‌ పదాలు లేవని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ పేర్కొన్నారు. లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యే ముందు ఆమె పార్లమెంట్‌ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఇదే విషయంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ 1978లో చేసిన సవరణతో సోషలిస్టు, సెక్యులర్‌ రాజ్యాంగ పీఠికలో పొందుపరిచారని, ఆ విషయం అందరికీ తెలుసని అన్నారు. అయితే తాజాగా ఇచ్చి ప్రతుల్లో ఆ పదాలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. చాలా తెలివిగా ఈ పని చేసినట్టు అనిపిస్తోందని, ఇది ఆందోళన కలిగించే అంశమని అన్నారు. సీపీఐ నేత బినరు విశ్వం మాట్లాడుతూ ఆ పదాలను తొలగించడం నేరమన్నారు. ఒకసారి సవరణ నోటిఫై చేసిన తరువాత పాత రాజ్యాంగాన్ని ప్రచురించకూడదన్నారు.

Spread the love