– నీటిలో ఈత కొట్టుకుంటూ వెళ్లి మరమ్మతులు చేసిన సిబ్బంది
నవతెలంగాణ-కొడంగల్
కాసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోతే చాలు.. వెంటనే లైన్‌మన్‌కి ఫోన్ చేసి అన్నా కరెంట్ ఎప్పు డొస్తుంది..? ఇలా చాలామంది అడుగు తుంటారు. మనిషి జీవితంలో కరెంట్ ఒక భాగమైపోయింది. విద్యుత్ ఉంటేనే చాలా పనులవుతాయి. ఒక్కోసారి వివిధ కారణాలతో సరఫరాలో అంతరాయం ఏర్ప డుతూ ఉంటుంది. క్షేత్రస్థాయి సిబ్బంది 24 గంట లూ విధుల్లో ఉంటూ వెంటనే పునరుద్ధరణకు చర్య లు తీసుకుంటారు. వీరి ఉద్యోగం చాలా కష్టతర మైంది. అత్యవసర శాఖల్లో విద్యుత్ శాఖ కూడా ఒకటి. క్షేత్రస్థాయిలో లైన్‌మన్లు, ఇతర సిబ్బందికి చాలా పని ఉంటుంది. కరెంట్ పోయిందని ఏ సమ యంలో వినియోగదారుల నుంచి సమాచారం వచ్చి నా తక్షణమే స్పందిస్తారు. విద్యుత్ లైన్లు తెగిపో యినా, స్తంభాలు పడిపోయినా, లైన్లకు చెట్ల కొమ్మలు అడ్డుపడినా, ట్రాన్స్‌ఫార్మర్లలో ఫ్యూజ్‌ల సమస్యలు తలెత్తినా, హై ఓల్టేజ్‌లో ఓల్టేజ్ సమస్య లు ఏర్పడినా వెంటనే స్పందిస్తారు. మరమ్మతులు చేసి సరఫరాను పునరుద్ధరిస్తుంటారు. లైన్లు తెగిన సమయంలో ప్రాణాలకు తెగించి సిబ్బంది స్తంభాలు ఎక్కి మరమ్మతులు చేస్తుంటారు. అలాంటిదే బొం రాస్పేట్ మండలం సెక్షన్ పరిధిలో ఎరుపు మల్ల, బురణ్‌పూర్ గ్రామాల పరిధిలోని సుద్దకుంట, తాటి కుంటలో వైర్లు తెగి విద్యుత్ సరఫరా నిలిచిపో యింది. ఈ పరిస్థితుల్లో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మొక్కవోని దీక్షతో పనులు చేపట్టారు. విద్యుత్ స్తంభం నీటికుంటలో నీట మునగడంతో బ్రేక్ డౌన్ అయింది. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని జూనియర్ లైన్‌మెన్లు అత్యంత ధైర్య సాహసంతో గుండె నిబ్బ రాన్ని ప్రదర్శిస్తూ ప్రాణాలకు తెగించి నీటిలో ఈత కొట్టుకుంటూ విద్యుత్ స్తంభం వద్దకు చేరుకున్నారు. అత్యంత కష్టం మీద స్తంభం ఎక్కి దాని తెగిపడిన వైర్లను చుట్టడంతో నిలిచిపోయిన విద్యుత్తును పున రుద్ధరణ చేయగలిగారు. విధినిర్వహణలో చిత్తశుద్ధిని ప్రదర్శించి చీకట్లో మగ్గుతున్న వారికి వెలుగులు పంచిన జూనియర్ లైన్‌మెన్ లను ఆయా గ్రామస్తులు ప్రశంశలతో ముంచెత్తారు.