వివోఏల సమస్యలు పరిష్కరించాలని ఎంపీకి వినతి

– ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్
– సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ హామీ
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపీ వీవోఏలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలురకాల డిమాండ్లతో కూడిన పత్రాన్ని సోమవారం దుబ్బాక మండలంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో మెదక్ ఎంపీకి కొత్త ప్రభాకర్ రెడ్డికి అందజేశారు.ఈ సందర్భంగా వీవోఏ దుబ్బాక మండల అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపీ వీవోఏ లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.గత 20 ఏళ్లుగా జీతాలు లేకుండా పని చేశాo. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక తమను వివోఏలుగా రూ. 3900 గౌరవ వేతనం కల్పించింది. కానీ నేడు ఆ డబ్బులతో కుటుంబ పోషణ ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, గౌరవ వేతనాలు అందేలా చూడాలని మెదక్ ఎంపీకి వినతి పత్రం అందించామన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేలా కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారని వారు తెలిపారు.కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జామున, కార్యదర్శి సుజాత, కోశాధికారి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి బాబు,సహాయ కోశాధికారి తదితరులు ఉన్నారు.
Spread the love