మహిళ సంక్షేమానికి విప్లమాత్మకమైన పథకాలు

– మహిళా సంఘాలకు ఏడు కోట్ల చెక్కుల అందజేత
– హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
మహిళా సంక్షేమం కోసం దేశంలోనే ఏరాష్ట్రం ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి విప్లవాత్మక పథకాలను తీసుకువచ్చిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని టీచర్స్ ట్రైనింగ్ భవన్ లో తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో సగ భాగమైన మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తుందన్నారు. కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్, అమ్మఒడి వాహనాలు, ఆరోగ్య లక్ష్మి, షి టీమ్స్, భరోసా, సఖి కేంద్రాలు, పారిశ్రామికులుగా ఎదగడానికి వీ-హబ్ తదితర కార్యక్రమాలతో మహిళల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తూ, మహిళలను అభివృద్ధి పథంలో నడుపతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. మహిళల కోసం రిజర్వేషన్ లు పెంచి మహిళా సాధికారికత కోసం కృషి చేశారని అన్నారు. అంగన్ వాడి టీచర్లకు, ఆయాలకు 300% జీతాలను పెంచిన ప్రభుత్వం దేశంలో కేవలం తెలంగాణ ప్రభుత్వమే అన్నారు.హుస్నాబాద్ నియోజకవర్గ మండల మహిళల సమైక్యలకు బ్యాంకు లొంకేజీ రూ. 7 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు.బ్యాంకు లింకేజీ ద్వారా ఆర్థిక సహాయం, వడ్డీ లేని రుణలతో కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ బాబు, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, ఎంపీపీ లకావత్ మానస సుభాష్, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన రజిని తిరుపతిరెడ్డి, మలోతు లక్ష్మీ బిల్లు నాయక్, జడ్పిటిసి భూక్య మంగ , ఏపిఎం శ్రీనివాస్, సిడిపిఓ జయ కౌన్సిలర్లు, మహిళాలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love