అధర్మంపై ఎప్పటికీ ధర్మమే గెలుస్తుంది

– సుప్రీంకోర్టు తీర్పు ఒక చారిత్రకఘట్టం 

– నిజమాబాద్ మాజీ మేయర్ డి.సంజయ్
నవతెలంగాణ- కంటేశ్వర్
అధర్మంపై ఎప్పటికీ ధర్మమే గెలుస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ఒక చారిత్రక కట్టమని నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంపై నిజామాబాద్ మాజీ మేయర్ డి.సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. అన్యాయంపై న్యాయమే గెలిచిందని ఈ తీర్పు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింతగా పెంచిందన్నారు. సత్యమేవ జయతే అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డి.సంజయ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం నందు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ చిత్రపటాలకు పూలమాలతో నివాళులర్పించి, రాహుల్ గాంధీ జిందాబాద్, సోనియాగాంధీ జిందాబాద్, రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ అందరికి మిఠాయి పంచి, బాణాసంచా కాల్చి సంబరాలు డి.సంజయ్  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి నిర్వహించారు.
Spread the love