రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు

– 4 నెలల 19 రోజుల్లో 302 రోడ్డు ప్రమాదాలు
– ఈనెల 19వ తేదీ వరకు 132 మంది మృత్యువాత
– నిజాంబాద్ జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
– నిజాంబాద్ లో ఇదే తొలి రికార్డ్
నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మే 2023 వరకు 302 రోడ్డు ప్రమాదాలు జరగగా అందులో ఒక 117 రోడ్డు ప్రమాదాలలో  132 మంది మృతి చెందారు. అలాగే 159 రోడ్డు ప్రమాదాలు జరగగా 283 గాయాల పాలయ్యారు. 26 రోడ్డు ప్రమాదాలలో వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాకుండా కేవలం వాహనాలు మటుకే డ్యామేజ్ ఐ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా చూసుకుంటే ప్యాటల్ ప్రమాదాలలో 117, గ్రేవియస్ ఇంజురీస్ 3, మైనర్ ఇంజురీస్ ఒక 156, నాన్ ఇంజురీస్ 26 మొత్తం 302 రోడ్డు ప్రమాదాలలో 132 మృతి చెందారు. గ్రేవి సింధూరిస్ అయిదుగురికి జరగగా మైనర్ ఇంజురీస్ 283 మందికి కాగా మొత్తం 420 మంది రోడ్డు ప్రమాదాలలో నష్టపోయారు. ఇది కొన్ని సంవత్సరాల కంటే మొదటి రికార్డుగా పోలీసులు వర్గాల ద్వారా తెలిసింది. రోడ్డు ప్రమాదాలు జరగడానికి ముఖ్యంగా కారణాలు నిజాంబాద్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించిన అక్కడ స్పీడు బ్రేకర్లను ఏర్పాటు చేయకపోవడం, అలాగే రోడ్డు ప్రమాదాలను ఎక్కువగా ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ గతంలో ఒక కమిటీ వేశారు ఇప్పుడు ఆ కమిటీ పని చేస్తుందో లేదో తెలియడం లేదు. ముఖ్య కారణం ఏమవుతుందంటే ఇందులో పాదాచార్యులు ఆటో వాళ్ళతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే జనాభా దామాషా ప్రకారం నిజాంబాద్ కు అనునిత్యం ఎక్కువ సంఖ్యలో ప్రజలు వస్తూ వెళ్తూ ఉంటారు ఈ కారణంగా ఆటోలు ఎక్కువగా అయ్యాయి. ప్రజలు ఆటో కావాలంటే రోడ్డుపైకి వచ్చి ఆటోలను ఆపుతున్నారు. ఆ ఆటోలను ఆపడం వలన వెనుకున్న ఆటోలు కూడా ప్యాసింజర్ ను ఎక్కించుకునేందుకు ముందరికి వస్తున్నారు ఆ నేపథ్యంలో వెనుకున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. నిజాంబాద్ జిల్లాలో కేవలం నాలుగు నెలల్లో 255 యాక్సిడెంట్లు జరిగాయి అంటే ప్రజలు, వాహనదారులందరూ అర్థం చేసుకోవాలి. నిజాంబాద్ జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా చూసుకుంటే 2020లో 306 కేసులు నమోదు కాగా 331 మంది మరణించగా 546 మంది క్షతగాత్రుల పాలయ్యారు. 2021 సంవత్సరంలో 320 రోడ్డు ప్రమాదాల కేసులు నమోదు కాగా 329 మరణాలు చెందగా 522 మంది క్షతగాత్రులు అయ్యారు. 2022లో 291 కేసుల నమోదు కాగా 320 మంది మృత్యువాత పడగా 643 మందికి గాయాల పాలయ్యారు. తాజాగా 2023లో చూసుకుంటే కేవలం నాలుగు నెలల్లోనే మొత్తం రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసులు 302 నమోదు కాగా ఇందులో 132 మంది మృత్యువాత పడ్డారు. కేవలం 4 నెలల 19 రోజుల్లోనే 302 రోడ్డు ప్రమాదాలు జరిగాయంటే అసలు నిజాంబాద్ నగరంలో ప్రస్తుతం ఎవరి దారి వారిదే అన్నట్లుగా వాహనదారులు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్ని రోడ్డు ప్రమాదాల కేసులు  నమోదు కావడం చూస్తుంటే ఇంకా ఏడు నెలల పది రోజుల్లో ఇంకెన్ని రోడ్డు యాక్సిడెంట్లు అవుతాయో వాటిని పోలీసులు ఎలా అరికడతారు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి. హైవేలపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు మద్యం తాగి వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నాయని పోలీసులు చెబుతు న్నాయి. రోడ్డు ఎక్కాలంటే వాహనదారులు జంకాల్సిన పరిస్థితి నెలకొడుతుంది కానీ ఎట్టి పరిస్థితులలో వాహనాలు లేకుండా బయట వెళ్ళలేని పరిస్థితి ఉండడంతో ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో రోడ్డుకు ఇరువైపులా వరి ధాన్యం ఎండబోయడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే జరిగాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు నిజాంబాద్ జిల్లా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాలి…..
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 40 బ్లాక్ స్పర్ట్స్ గుర్తింపు
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 40 బ్లాక్ స్పాట్లను డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ గుర్తించినట్లు తెలిసింది. అందుకని నూరుగా చర్యలు సైతం చేపట్టారని సంబంధిత శాఖ అధికారులు తెలుపుతున్నారు. నిజాంబాద్ లో బ్లాక్ స్పోర్ట్స్ ఆర్ఆర్ చౌరస్తా వర్ని చౌరస్తా అరసపల్లి బైపాస్ కాలూరు ఎక్స్ రోడ్ వద్ద ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి, బొర్గం చౌరస్తా, ఖానాపూర్, నడిపెల్లి, ధర్మారం, డిచ్పల్లి హైవే ఇందల్వాయి టోల్గేట్ మధ్యలో, డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ 2022లో 19 బ్లాక్ స్పాట్లను గుర్తించింది ప్రస్తుతం మొత్తం అవి ఇవి కలుపుకొని సుమారు 40 వరకు ఉంటాయి. డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీకి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ చైర్మన్గా, వాయిస్ ఛైర్మన్లుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్, ఆర్ అండ్ బి ఈ ఈ, పంచాయతీ రాజ్ ఈ ఈ, ట్రాఫిక్ ఏసిపి, నేషనల్ హైవే అథారిటీ సభ్యుడు నిర్మల్కు చెందిన వ్యక్తి, ఎక్సైజ్ శాఖ నుండి ఒకరు, ఫారెస్టు కార్యాలయం నుండి ఒకరు, 108 నుండి ఈఎమ్ఆర్ఐ సభ్యుడు ఒకరు ఆర్టీవో కార్యాలయం నుండి ఒకరు, దీనిని మొత్తం నోడల్ అధికారిగా ఆర్ అండ్ బి  ఈ ఈ ఒకరు కోఆర్డినేట్ చేస్తారని తెలిసింది..
వాహనదారులు నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి
లేనియెడల చట్ట ప్రకారంగా చర్యలే కాకుండా కేసులను సైతం నమోదు చేస్తాం
నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్ వెల్లడి
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల వాహనదారులు తూచా తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ ను పోలీస్ శాఖ విడుదల చేసిన నియమ నిబంధనలను పాటించాలి. అతిక్రమిస్తే చట్ట ప్రకారంగా చర్యలే కాకుండా కేసులను సైతం నమోదు చేస్తామని నిజామాబాద్ సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్ వాహనదారులను హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నే కాకుండా ఇతర ప్రాంతాల నుండి నిజామాబాద్ జిల్లాకు వచ్చేవారు కూడా వాహనాలను నడిపే ముందు మొట్టమొదటిగా అతివేగంగా వాహనాలను నడపకూడదు. లైసెన్స్ లేకుండా వాహనాలను రోడ్డుపైకి తీసుకురావద్దు. వాహనానికి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలి. వాహనదారుడు తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన ధ్రువపత్రం అందుబాటులోనే ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితులలో కూడా ఆలస్యమైనా సరే రాంగ్ రూట్లో వెళ్లకూడదు. ముఖ్యంగా ఆటోలు ప్యాసింజర్లను ఓవర్ లోడింగ్ ఎక్కించుకోకూడదు. ఎట్టి పరిస్థితులలో మద్యం సేవించి వాహనాన్ని నడపకూడదు.
ప్రతి వాహనదారులు ఎక్కడ కూడా అత్యధిక వేగంతో వాహనాలను నడపకూడదు. రోడ్డుకు ఇరువైపులా ఎంత స్పీడ్ తో వెళ్ళాలో పెట్టి ఉన్నాయి వాటిని తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. అలాగే నిజామాబాద్ పోలీస్ శాఖ ద్వారా కేవలం నిజామాబాద్ నగరంలోనే కాకుండా నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ సబ్ డివిజన్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను ఎలా నివారించాలి అనే అంశంపై కళాజాత కార్యక్రమాలను గ్రామాలలో మండలాలలో నిర్వహిస్తున్నాము. అయినా వాహనదారుల్లో మార్పులు రావడం లేదు. పాదాచారులు ఆటోలతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని సమాచారం ఉంది అయితే తప్పనిసరిగా పాదాచారులు ఆటోలను పిలిచేటప్పుడు రోడ్డుకు క్రింది భాగంలో ఉండి ఆటోలను పిలవాలని తెలిపారు. ఏ ఒక్క నియమ నిబంధనలను వాహనదారులు పాటించకపోతే తప్పనిసరిగా జరిమానాలను విధిస్తాం కేసులను నమోదు చేస్తాం అవసరమైతే కేసు తీవ్రతను బట్టి జైలుకు కూడా పంపుతాము.
Spread the love