Sunday, April 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏఎమ్మార్ ఆధ్వర్యంలో రోడ్డు పనుల ప్రారంభం..

ఏఎమ్మార్ ఆధ్వర్యంలో రోడ్డు పనుల ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో కోమటి కుంట నుంచి ఎర్రగుంట వరకు రోడ్డు వేయాలని ఇటివల రైతులు ఏఎమ్మార్ కంపెనీకి విన్నవించిన నేపథ్యంలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం సి ఎస్ఆర్ నిధుల ద్వారా కోమటికుంట నుండి ఎర్రగుంట వరకు రోడ్డు పనులను ప్రారంభించారు. ఇందుకు రైతులు,ప్రజలు ఏఎమ్మార్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా శుక్రవారం ఏఎమ్మార్ ప్రతినిధులు ఎస్ఓ సురేష్ బాబు,ల్యాండ్ ఆక్వేషన్ ఆఫీసర్ రామచంద్రమూర్తి పర్యవేక్షించి పనులు ప్రారంభించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎమ్మార్ ఉద్యోగులు వర్క్ ఇన్స్పెక్టర్ సదానందం,సిఎస్ఆర్ సూపర్వైజర్ బొబ్బిలి నరేష్,నారమల్ల నరేష్,రాజాక్,ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -