రూ. 1.12 లక్షలు పట్టివేత..

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు తనిఖీల్లో పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంద్రప్రదేశ్, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కు చెందిన సంజయ్ కుమార్ బుధవారం తన కారులో అశ్వారావుపేట మీదుగా కుక్కునూరు వెళుతున్నాడు.స్థానిక అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఎస్సై శ్రీకాంత్  సంజయ్ కుమార్ కారులో రూ.1,12,500 నగదును గుర్తించారు.నగదు కు ఎటువంటి అధారాలు చూపక పోవటంతో సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
Spread the love