రైలు ప్రమాద బాధితులకు రూ.10 లక్షల పరిహారం

నవతెలంగాణ – బిహర్: బిహార్‌లోని బుక్సర్ జిల్లాలో నార్త్ ఈస్ట్ సూపర్ ఫాస్ట్ రైలు భోగీలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా.. వంద మందికిపైగా గాయపడ్డారు. ఈ రైలు ప్రమాద బాధితులకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ గురువారం ప్రకటించింది. ఘటనపై స్పందించిన బిహార్ సీఎం నితీష్ కుమార్ తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Spread the love