రుద్రమ్-2 యాంటీ రేడియేషన్ మిసైల్ పరీక్ష విజయవంతం

నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయంగా అభివృద్ధి చేసి తొలి యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్రమ్-2 ను డీఆర్‌డీఓ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. మిసైల్ చోదక వ్యవస్థ, నియంత్రణ, మార్గదర్శక వ్యవస్థలు ఆశించిన రీతిలో పనిచేశాయని డీఆర్‌డీఓ నెట్టింట పేర్కొంది. గగనతల లక్ష్యాలను ఛేదించే ఈ మిసైల్ నుంచి సు-30 ఎమ్‌కే-1 నుంచి ప్రయోగించారు. ఈ మిసైల్ ధ్వని వేగానికి రెండు రెట్ల స్పీడుతో ప్రయాణిస్తుంది. శత్రుదేశాల రాడార్, కమ్యూనికేషన్, గగనతల రక్షణ వ్యవస్థలను రుద్రమ్ ధ్వంచం చేయగలదని డీఆర్‌డీఓ ప్రకటించింది. దీర్ఘశ్రేణి యాంటీ రేడియేషన్ మిసైళ్లను భారత్ అభివృద్ధి చేసుకోగలదన్న విషయాన్ని రుద్రమ్ రుజువు చేసిందని నిపుణులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం డీఆర్‌డీఓ.. తొలి తరం రుద్రమ్ మిసైల్‌ను పరీక్షించింది. ఈ మిసైల్.. రేడియేషన్ వెలువరించే వ్యవస్థలను గుర్తించి, నిర్వీర్యం చేస్తుందని డీఆర్‌డీఓ పేర్కొంది.

Spread the love