
సహారా ఇండియా కంపెనీ బాధితులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నీ సోమవారం కలిసి డబ్బులు ఇప్పించాలని ఎల్ఐసి ఆర్మూర్ బ్రాంచ్ అధ్యక్షులు బాలయ్య సోమవారం తెలిపారు. దేశంలో 12 కోట్ల మంది పెద, మద్య తరగతి ప్రజలు సహారా ఇండియా కంపని సంస్థలో పొదుపు చేసుకున్న 86 వేల కోట్ల డబ్బుల్ని తిరిగి చెల్లించకుండా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, కనుక కేంద్ర ప్రభుత్వం సహారావు బాధితులకు వెంటనే డబ్బులు చెల్లించి ఆదుకోవాలని ఆయన కోరారు. వివిధ అవసరాల కోసం, పొదుపు చేసుకున్న డబ్బును గంపెడు ఆశతో భవిష్యత్తులో పిల్లల చదువులకు పెళ్లిళ్లకు ఉపయోగపడుతుందని ఆశతో సహారా బ్యాంకుల్లో పొదుపు చేసుకుంటే కంపెనీతో కుమ్మక్కై కేంద్ర ప్రభుత్వం ప్రజల డబ్బుతో కోట్లాది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదిగిన పిల్లల చదువులకు, డబ్బులు లేక పిల్లల చదువులు మధ్యలోనే ఆగి పోతున్నాయనీ, ఆయన తెలిపారు. లబ్ధిదారులు ఏజెంట్ల పై ఒత్తిడి తేవడంతో వేలమంది ఖాతాదారులు డబ్బులు రానందున ఆత్మహత్యలు పాల్పడ్డారని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ఖాతాదారుల డబ్బులు చెల్లించాలని 2023లో ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం శోచనీయమని ఆన్లైన్ ద్వారా చెల్లిస్తామని పోర్టల్ ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా ఈరోజు నాటికి 86 వేల కోట్ల కేవలం 500 కోట్లు మాత్రమే చెల్లించినారనీ,500 కోట్లకు సంవత్సరంనరకాలం పడితే 86 వేల కోట్ల రూపాయలు చెల్లించడానికి ఇంకెన్ని దశాబ్దాలు పడుతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. 12 కోట్ల మంది ఖాతాదారుల కుటుంబంతో పది లక్షల మంది ఏజెంట్ల జీవితాలను బజారు కీడ్చుడం సరికాదని ఆయన అన్నారు . పార్లమెంటు ఎన్నికల సభల్లో సహారా ఖాతాదారులకు డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చిన అమిత్ షా ఈ రోజున మాట మాట్లాడలేక పోవడం విచారకరమని అని ఆయన అన్నారు. సహారా కంపెనీతో అమిత్ షా కుమారుడు బీజేపీ నాయకులకు ఆర్థిక సంబంధాలు ఉండడం మూలంగానే ప్రజలకు డబ్బులు చెల్లించడంలో కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని బాధితులకు అనుమానం వస్తుందని ఆయన తెలిపారు.86 వేల కోట్ల డబ్బుల్ని పోర్టల్ ఆన్లైన్ ద్వారా కాకుండా నేషనల్ బ్యాంకు ద్వారా చెల్లించి 12 వేల కోట్ల కుటుంబాలకు వెలుగునిచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు . ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి మీ సమస్య పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తానని మాట ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాగౌడ్, నరసయ్య, నరేందర్, శేఖర్, పురుషోత్తం, గోపి, రమేష్, సాయికుమార్, భూమేశ్వర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.