పవన్ కు సాయిదుర్గ తేజ్ స్పెషల్ గిఫ్ట్..

నవతెలంగాణ – హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ప్రత్యేకించి కుటుంబ సభ్యులు ఆయన్ను అభినందిస్తున్నారు.  తాజాగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ కూడా స్పెషల్ గిఫ్ట్‌ను అందజేశారు. ‘స్టార్ వార్స్ అండ్ లెగో’ కిట్‌ను బహుమతిగా అందజేశారు. ‘‘స్టార్ వార్స్, లెగోలను నాకు పరిచయం చేసిన వ్యక్తి, నా ప్రియమైన జేడీ మాస్టర్ (స్టార్ వార్ కల్పిత పాత్ర), డిప్యూటీ సీఎంకు ఎట్టకేలకు ఒక బహుమతి ఇచ్చే అవకాశం నాకు వచ్చింది. చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటూ ఆయనలోని పిల్లాడికి మేనల్లుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఫోర్స్ కూడా మాతోనే ఉంటారు’’ అని ఎక్స్‌లో సాయిధరమ్ తేజ్ రాసుకొచ్చాడు.

Spread the love