నవతెలంగాణ-బోడుప్పల్: సమాజంలో జరిగే ప్రతి అంశాన్ని ప్రశ్నించే తత్వాన్ని నేర్పించేది ఏఐఎస్ఎఫ్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం నాడు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ అర్ కన్వెన్షన్ హాల్ లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను ప్రారంభించారు. నేటి తరం విద్యార్థులు గత చరిత్రను తెలుసుకుని గొప్ప గొప్ప పోరాటాలను తెలుసుకోవడం ద్వారా అనేక విషయాలు తెలుస్తాయని అన్నారు. బీజేపీ నేడు విద్యా కాషాయికరణ చేసేందుకు కుట్రలు చేస్తూ పాఠ్యాంశాల నుండి డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించే కుట్రలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినిమా ప్రోడ్యుసర్ మాదాల రవి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.బాలమల్లేష్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్షణ్, కార్యదర్శి మణికంఠ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.