నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు…

నవతెలంగాణ-సుల్తాన్ బజార్ 
నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఉద్దేశంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో శివాజీ బ్రిడ్జి స్లం ఏరియాను దత్తత తీసుకోవడం జరిగిందని ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ రవీందర్ రెడ్డి అన్నారు ఆదివారం  అఫ్జల్ గంజ్ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం ఎదురుగా ఉన్న స్లం ఏరియాను ఐఎంఎస్ సిటీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ దయ్యాల్ సింగ్ ఆధ్వర్యంలో ఆవ్ గావ్ చలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన అన్ని విభాగాల వైద్యులతో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు, మురికివాడలలో జీవిస్తున్న ప్రజలకు వైద్యం పై అవగాహన పెంచడంతోపాటు వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మురికి వాడలను దత్తత తీసుకొని వారికి మెరుగైన వైద్య సేవలు అందించి జీవితాంతం ఆరోగ్యం గా ఉండేలా నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఐఎంఏ సిటీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ దయ్యాల్ సింగ్ మాట్లాడుతూ.. మురికి వాడల లోని ప్రజలు చెత్తాచెదారం మయమైన ప్రాంతాలలో నివసిస్తుండడం వలన వారి ఆరోగ్యాలు పూర్తిగా చెడిపోయే ప్రమాదం ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఐఎంఏ సిటీ శాఖ ఆధ్వర్యంలో శివాజీ బ్రిడ్జి స్లం ఏరియాను దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతినెల 4వ ఆదివారం ఈ ప్రాంతంలో వైద్య శిబిరం నిర్వహించి వైద్య పరీక్షలతోపాటు మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అత్యవసరమైన వారికి ఉస్మానియా. గాంధీ. నీలోఫర్. మెటర్నటీ  దావాఖానాలలో వైద్య సేవలు అందించేందుకు ఐఎంఏ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. అంతేకాకుండా ప్రతి శుక్రవారం చాదర్ఘాట్ లోని సాయిబాబా మందిరంలో ఉదయం 9 గంటల నుంచి పదిన్నర గంటల వరకు వైద్య శిబిరంలో పాల్గొని వారికి అవసరమైన మందులను తీసుకోవాల్సిందిగా మురికివాడ ప్రజలను ఆయన కోరారు. దత్తత తీసుకున్న ఈ మురికివాడల్లో నిర్వహించే వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్. డయాబెటిస్. గైనకాలజీ. డెర్మటాలజీ. ఆర్థోపెడిక్. గ్యాస్ట్రో ఎంట్రాలజీ. చిన్నపిల్లల తదితర వైద్యులు అందుబాటులో ఉండి మురికివాడల ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ సిటీ శాఖ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ టి వి శ్రీనివాస్. ప్రొఫెసర్ డాక్టర్ పరహాజ్. పరిషిత. డాక్టర్ బి.ఎస్ శ్రీకాంత్. డాక్టర్ ఆశ. డాక్టర్ వివేక్ కందర్ కార్. డాక్టర్ రహమత్. డాక్టర్ వి ఎస్ గన శ్రీ నాయుడు. డాక్టర్ రామదాస్. డాక్టర్ అనర్ కార్. డాక్టర్ విజయ్ కుమార్. డాక్టర్ జహీరా కన్నన్. డాక్టర్ ఈ రవీందర్ రెడ్డి. డాక్టర్ దిలీప్ భానుశాలి తదితరులు పాల్గొన్నారు
Spread the love