హాయత్ నగర్ లో హిజాజ్ వివాదం….

– బాధితురాలు జడ్జి కూతురు కావడంతో స్కూల్ పై కేస్ నమోదు…
నవతెలంగాణ-హాయత్ నగర్
ఓ ముస్లిం విద్యార్థి ని బురఖా ధరించినదని పాఠశాల యాజమాన్యం అసభ్యంగా ప్రవర్తించిన తీరుపై హాయత్ నగర్ పోలీసులు కేస్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హాయత్ నగర్ డివిజన్ పరిధిలోని అన్మగల్ హాయత్ నగర్ లో ఉన్న జీ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న ఓ ముస్లిం విద్యార్థిని హాయత్ నగర్ కోర్టులో జడ్జి గా పనిచేస్తున్నది.తన కూతురు రోజు మాదిరిగానే  ఆమె కూతురు బురఖా ధరించగా స్కూల్ యాజమాన్యం స్కూల్ విద్యార్థులు అందరూ కూడా సమాన భావంతో ఉండాలని,తరగతి గదిలో బురఖా తొలగించాలని బాలికకు చెప్పగా సమాచారం అందుకున్న బాలిక తల్లిదండ్రులు వెంటనే స్కూల్ వద్దకు చేరుకుని తన కూతురును తోటి విద్యార్థుల ముందు అవమానించారని పోలీసులకు పిర్యాదు చేయగా కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇట్టి విషయంపై స్కూల్ యాజమాన్యంను నవతెలంగాణ వివరణ కోరగా ప్రతి విద్యార్థి సమానమే అని,బురఖా తరగతి గదిలో వేసుకోవద్దు అన్న మాట వాస్తవమే అని తెలిపారు.
Spread the love