– మొత్తం రూ.7,40,400 విడుదల
– చెల్లింపులు ప్రారంభించిన తహశీల్దార్ దాసరి కిశోర్
నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట మండలంలో జనాభా గణన–2026 విధులు నిర్వహించిన సిబ్బందికి చెల్లించాల్సిన వేతనాల కోసం మొత్తం రూ.7,40,400 మంజూరయ్యాయి. మండలంలోని 103 బ్లాక్‌లకు గాను 64 మంది ఎన్యూమరేటర్లు, 13 మంది సూపర్వైజర్లు విధులు నిర్వహించారు. వీరికి ఒక్కొక్కరికి శిక్షణా భత్యం రూ.1,200, వేతనం రూ.9,000 చెల్లించనున్నారు. ఈ మేరకు 77 మంది సిబ్బందికి శిక్షణా భత్యంగా రూ.92,400, 72 మంది సిబ్బందికి వేతనాలుగా రూ.6,48,000 విడుదల చేశారు. గురువారం తహశీల్దార్ దాసరి కిశోర్ కుమార్ చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ కొత్తపల్లి రాము, టెక్నికల్ అసిస్టెంట్ టి. రామకృష్ణ పాల్గొన్నారు.
మంజూరైన జనాభా గణన సిబ్బంది వేతనాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


